మూడు వన్డేల సిరీస్ కోసం కెఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు జింబాబ్వే చేరుకుంది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఈ మూడు మ్యాచ్ లూ జరగనున్నాయి. హరారేలోని మైదానంలో నేడు భారత ఆటగాళ్ళు ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
తొలుత ఈ సిరీస్ కు శిఖర్ ధావన్ సారధ్యంలో 15మంది సభ్యులతో కూడిన జట్టును బిసిసిఐ ప్రకతిన్చిన్దిన్. అయితే కెఎల్ రాహుల్ సర్జరీ, ఆ తరువాత కోవిడ్ కారణంగా ఐపీఎల్ తరువాత ఏ మ్యాచ్ లూ ఆడలేకపోయాడు. ఈ నెలాఖరున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రారంభం కానున్నఆసియా కప్ కు సన్నద్ధం కావాల్సి ఉండడంతో కెఎల్ రాహుల్ ను జింబాబ్వేతో జరగనున్న వన్డే సిరీస్ లో ఆడించాలని బిసిసిఐ భావించింది. అందుకే పూర్తిగా ఫిట్ సాధించిన రాహుల్ ను కెప్టెన్ గా శిఖర్ స్థానంలో ఎంపిక చేసి హరారే పంపింది.
భారత కాలమానం ప్రకారం ఆగష్టు 18న మధ్యాహ్నం 12.45 గంటలకు తొలి వన్డే మొదలు కానుంది.
Also Read : ధావన్ స్థానంలో రాహుల్