Sunday, April 27, 2025
Homeస్పోర్ట్స్South Africa tour of India, 2022: ఇండియాదే వన్డే సిరీస్

South Africa tour of India, 2022: ఇండియాదే వన్డే సిరీస్

సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ఇండియా  కైవసం చేసుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే నేటి మ్యాచ్ లో భారత బౌలర్లు  పదునైన బంతులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేసి 99 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇండియా ఈ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో మూడు వికెట్లు  కోల్పోయి ఛేదించింది.

ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రోటీస్ జట్టులో క్లాసేన్-34; జన్నేమాన్ మలాన్-15; మార్కో జన్సేన్ -14 పరుగులతో మాత్రమే రెండంకెల స్కోరుతో రాణించారు.  దీనితో ఆ జట్టు 27.1  ఓవర్లలో 99 పరుగులకే చాప చుట్టేసింది.

ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు; సిరాజ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ తలా రెండు వికెట్లతో రాణించారు.

ఆ తర్వాత ఇండియా తొలి వికెట్ కు 42 పరుగులు చేసింది. శిఖర్ కేవలం 8 పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ 49 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ 10 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్(28)- సంజూ శామ్సన్(2)లు నాటౌట్ గా నిలిచారు. శ్రేయాస్ సిక్సర్ తో విన్నింగ్ షాట్ కొట్టాడు. 19.1 ఓవర్లలో 105 పరుగులు చేసింది.

సౌతాఫ్రికా బౌలర్లలో నిగిడి, బిజోర్న్  చెరో వికెట్ పడగొట్టారు.

కుల్దీప్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’…మహమ్మద్ సిరాజ్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’  లభించింది.

Also Read :  శ్రేయాస్ సెంచరీ- ఇండియా విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్