Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న త్రివిక్ర‌మ్. ?

మ‌హేష్ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న త్రివిక్ర‌మ్. ?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు రూపొంద‌డం.. ఆ రెండు చిత్రాలు ఇద్ద‌రికీ మంచి పేరు తీసుకురావ‌డం తెలిసిందే. ఆత‌ర్వాత మ‌ళ్లీ ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేయాల‌నుకున్నారు కానీ. కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. ఈ క్రేజీ కాంబినేష‌న్లో ప్రాజెక్ట్ కుదిరింది. ఆమ‌ధ్య సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో గ్రాండ్ గా ప్రారంభ‌మైన ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… ఈ సినిమా కోసం త్రివిక్ర‌మ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏంటంటే… త్రివిక్ర‌మ్ త‌ను తెర‌కెక్కించిన సినిమాల‌కు అ అనే అక్ష‌రంతో స్టార్ట్ అయ్యేలా టైటిల్స్ పెడుతుంటారు. అత‌డు, అత్తారింటికి దారేది, అ ఆ, అర‌వింద స‌మేత‌, అల‌.. వైకుంఠ‌పుర‌ములో.. సినిమాలు స‌క్సెస్ అవ్వ‌గా అజ్ఞాత‌వాసి చిత్రం ఫ్లాప్ అయ్యింది. అయిన‌ప్ప‌టికీ.. మ‌హేష్ బాబుతో చేస్తున్న సినిమాకి అ సెంటిమెంట్ ఫాలో అవుతూ అర్జునుడు అనే టైటిల్ పెడుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

గ‌తంలో మ‌హేష్ అర్జున్ అనే టైటిల్ తో సినిమా చేసాడు క‌దా.. ఇప్పుడు అర్జునుడు అనే టైటిల్ తో సినిమా చేస్తాడా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ.. అర్జునుడు అనే టైటిల్ ఖ‌రారు చేశార‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై మ‌రెంత ఆస‌క్తి పెరిగింది. ప్ర‌చారంలో ఉన్న వార్త వాస్త‌వ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది. కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 31న ఈ మూవీ టైటిల్ ప్ర‌క‌టించ‌నున్నార‌ని స‌మాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్