Saturday, September 21, 2024
HomeTrending Newsబిజెపిని ఎదుర్కోవటం కాంగ్రెస్ తోనే సాధ్యం - లాలు

బిజెపిని ఎదుర్కోవటం కాంగ్రెస్ తోనే సాధ్యం – లాలు

దేశ రాజకీయాల్లో బిజెపిని దీటుగా ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం కావాలని రాష్ట్రీయ జనతాదల్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ పిలుపు ఇచ్చారు. బిజెపి మత రాజకీయాలను నిలువరించటం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమె సాధ్యం అవుతుందని పాట్నాలో అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు ఆర్.జే.డి మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు. బీహార్ వరకు కాంగ్రెస్ తో పొత్తులు ఉన్నా లేకున్నా జాతీయ స్థాయిలో మొదటి నుంచి రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తోందని లాలు స్పష్టం చేశారు.

బావ సారుప్యత కలిగిన పార్టీలతో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్దమవుతే కమలం పార్టీని ఎదుర్కోవచ్చన్నారు. దేశంలో నిత్యావసరాల ధరలు, చమురు మంటలతో ప్రజల జీవనప్రమాణాలు రోజు రోజుకు దిగజారుతున్నాయని లాలు ఆందోళన వ్యక్తం చేశారు. నెయ్యి ధర కన్నా పెట్రోల్ ధరలు పెరిగాయని విమర్శించారు. అదుపులేని ద్రవ్యోల్భణం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని లాలు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న  ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని నిమజ్జనం చేస్తేనే దేశం ప్రశాంతంగా ఉంటుందని లాలు అన్నారు.

దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ మూడేళ్ళ తర్వాత పాట్నా వచ్చారు. వైద్యం కోసం బెయిల్ మీద రాంచి ఆస్పత్రిలో చేరారు. రెండేళ్లుగా అక్కడ వైద్యం జరుగుతుండగా మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో చేరారు. ఏడాదిగా లాలు AIIMS ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్