Sunday, January 19, 2025
Homeసినిమాక‌ళ్యాణ్ రామ్ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా..?

క‌ళ్యాణ్ రామ్ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా..?

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఫస్ట్ నుంచి విభిన్నమైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నారు. ఓ వైపు హీరోగా సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రో వైపు నిర్మాత‌గా రాణిస్తున్నారు. ఇటీవ‌ల ‘బింబిసార‘ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ తో బింబిసార మూవీకి సీక్వెల్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించి ఆల్రెడీ క‌థాచ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి టైమ్ ప‌డుతుంద‌ని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే… కళ్యాణ్‌ రామ్ 19వ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవలే గోవా షెడ్యూల్ ను పూర్తి చేసిన టీమ్, చివరి షెడ్యూల్ షూటింగుకి సన్నాహాలు చేస్తున్నారు. రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూడు పాత్రల మధ్య వేరియేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు.

కళ్యాణ్‌ రామ్ ఇలా మూడు పాత్రలను పోషించడం ఇదే మొదటిసారి. ఈ మూడు పాత్రలు కూడా దేనికదే ప్రత్యేకతను సంతరించుకుని ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇది ఓ ప్ర‌యోగ‌మే. కథాపరంగా ఈ సినిమాకి ఎమిగోస్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపుగా ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని చెబుతున్నారు. త్వరలోనే ఈ మూవీ టైటిల్ విషయంలో క్లారిటీ రానుంది టాక్ వినిపిస్తోంది. మ‌రి.. క‌ళ్యాణ్ రామ్ ప్ర‌యోగం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్