Saturday, January 18, 2025
HomeTrending Newsకిల్లి కృపారాణి, బీద మస్తాన్ లకు అవకాశం?

కిల్లి కృపారాణి, బీద మస్తాన్ లకు అవకాశం?

RS Chance:  ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నాలుగూ అధికార వైఎస్సార్సీపీకే దక్కనున్నాయి. అయితే అదృష్టం ఎవరిని వరిస్తుందనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.  వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్న వి.విజయసాయిరెడ్డికి రెన్యువల్ లభించే అవకాశాలు కనబడుతుండగా మరో మూడు స్థానాలకు అభ్యర్ధులు ఖరారు కావాల్సి ఉంది.

ఈ మూడింటిలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విజ్ఞప్తి మేరకు అయన భార్య ప్రీతీ ఆదానీకి సిఎం జగన్ ఒక సీటు ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పార్టీ ధ్రువీకరించలేదు. మిగిలిన రెండు స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు ఆశావహులుగా ఉన్నారు.

రాజకీయ పదవుల పంపకంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తోన్న జగన్… ఈ రెండిటికి బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్ రావు (నెల్లూరు జిల్లా- యాదవ), శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి (కళింగ) లను ఎంపిక చేసినట్లు తెలిసింది. రేపో మాపో ఈ పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Also Read : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్