Monday, April 15, 2024
HomeTrending Newsవైసీపీ 'మేము సిద్దం - మా బూత్ సిద్ధం'

వైసీపీ ‘మేము సిద్దం – మా బూత్ సిద్ధం’

మంగళగిరిలో రేపు జరగనున్న సమావేశం ఎంతో కీలకమైనదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.  క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉండే మండలపార్టీ నేతలు, పోలింగ్ బూత్ కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించి రాబోయే ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకులు, జేసిఎస్ కోఆర్డినేటర్లు, పోలింగ్ బూత్ ఇన్ ఛార్జ్ లు,నియోజకవర్గాలలో ఎన్నికలను పర్యవేక్షించే నేతలు పాల్గొంటారని వివరించారు. CK కన్వెన్షన్ లో రేపు జరిగే ‘మేము సిద్దం – మా బూత్ సిద్ధం’ ఏర్పాట్లను సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ…  ఎన్నికలలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, ప్రత్యర్థులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఎలా చూసుకోవాలి, ప్రజలలో మమేకమై ఇంతకాలంగా చేస్తున్న పనులను ప్రజలలోకి మరింతగా తీసుకెళ్లేలా ఏమి చర్యలు తీసుకోవాలి, వారి ఆశీస్సులు ఏవిధంగా కోరాలో ముఖ్యమంత్రి వివరిస్తారన్నారు. రేపటి సమావేశం తర్వాత మేం పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతామన్నారు.

మా పార్టీ అభ్యర్దులను ఎంపిక చేసే సమయంలో టిడిపి విమర్శలు చేసిందని, మీ కూటమి అభ్యర్ధుల ఎంపికతో రెండు పార్టీల్లో అసంతృప్తి మొదలవుతుందని  అప్పుడే తాము చెప్పామని గుర్తు చేశారు. తమ పార్టీకి సంబంధించినంతవరకు అసంతృప్తులెవరైనా ఉంటే పిలిచి మాట్లాడుతున్నామని, అందరూ సిఎం జగన్ గారిపై విశ్వాసం ఉన్నవారే కాబట్టి అంతా అర్ధం చేసుకుని సర్దుకున్నారని పేర్కొన్నారు.

టీడీపీ,జనసేన సీట్ల సర్ధుబాటు అతుకుల బొంతగా కనిపిస్తోందన్నారు.పవన్ కల్యాణ్ ను అనుసరించేవారు ఎన్ని ఆశిన్చారో  తెలియదు కాని పవన్ ను ఘోరంగా అవమానించి 24 సీట్లు కేటాయించారని, కానీ అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు,

ఇతర పార్టీలనుంచి చాలామంది వస్తారని అంటున్నారని కానీ.. కొత్తగా చేరేవారి వల్ల పార్టీకి ఉపయోగం…వారి ట్రాక్ రికార్డు బాగుంటేనే పరిగణన లోకి తీసుకోవాలన్నది జగన్ అభిమతమన్నారు. అంతేతప్ప గంపగుత్తగా వస్తున్నారనిఎవరిని పడితే వారిని చేర్చుకోబోమని తేల్చి చెప్పారు. దానివల్ల ఎన్నికలకు ముందు వచ్చే తలనొప్పులు ఉంటాయని సజ్జల అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్