Saturday, January 18, 2025
Homeసినిమాతెలుగు సినిమా తారక రత్నాన్ని కలిశా: అమిత్ షా ట్వీట్

తెలుగు సినిమా తారక రత్నాన్ని కలిశా: అమిత్ షా ట్వీట్

నిన్న తెలంగాణా పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో హీరోజూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకున్నారు. అమిత్ షా ఆహ్వానం మేరకు హోటల్ కు వచ్చిన జూనియర్ ఆయనతో దాదాపు అరగంట పాటు సమావేశయ్యారు. కేంద్ర మంత్రికి బోకే ఇచ్చి, శాలువా  కప్పారు.

అమిత్ షా ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమా చూశారని, దానిలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు ముగ్ధుడై ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసేందుకే పిలిపించారని బిజెపి వర్గాలు వెల్లడించినా… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారం సొంతం చేసుకోవాలనుకుంటున్న బిజెపి, దీనికి సంబంధించి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సెటిలర్లతో పాటు ఓ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. జూనియర్ బిజెపికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తే ఈ ఓట్లు తమకు పడతాయనే ఆలోచనలో బిజెపి కేంద్ర నాయకత్వం భావిస్తోంది.

మరోవైపు జూనియర్ తో మీటింగ్ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా…. “అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది” అంటూ త్వీట్ చేశారు.

దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ “ఇదో గొప్ప సమావేశం, మిమ్మలి కలిసి మాట్లాడడం ఎంతో సంతోషాన్నిచ్చింది. నా పట్ల వ్యక్తం చేసిన అభిప్రాయానికి ధన్యవాదాలు అమిత్ జీ “ అంటూ వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్