Kalavathi came: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’తో 2022లో తన విజయపరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ కళావతి ప్రోమో ఇటీవల విడుదలై ఫుల్ సాంగ్ కోసం అందరూ ఎదురు చూసేలా చేసింది. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ రోజు కళావతి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ సిద్ శ్రీరామ్, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట ఈ ఏడాది మెలొడి సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఈ పాటలో అన్ని ఫర్‌ఫెక్ట్ గా కుదిరాయి. మహేష్ బాబు హుక్ స్టెప్ అద్భుతంగా ఉంది. అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నెలకొలిపింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు స్వాగ్, కీర్తి సురేష్ అందం అబ్బురపరిచేలా ఉంది. వారి కెమిస్ట్రీ ఈ పాటకు అదనపు గ్లామర్ జోడించింది. సినిమాటోగ్రాఫర్ ఆర్ మధి విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
తమన్, సిద్ శ్రీరామ్, సంగీత బృందం సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా రూపొందించిన మ్యూజిక్ వీడియో ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. కళావతి ఖచ్చితంగా మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ మూవీలో మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. సర్కారు వారి పాట వేసవి కానుకగా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.