Saturday, January 18, 2025
Homeసినిమాతుది దశ చిత్రీకరణలో క‌ళ్యాణ్ రామ్ చిత్రం

తుది దశ చిత్రీకరణలో క‌ళ్యాణ్ రామ్ చిత్రం

వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. రీసెంట్‌గా విడుద‌లైన ‘బింబిసార‘ చిత్రంతో సెన్సేష‌న‌ల్  హిట్ సాధించిన ఆయన తాజాగా ‘మైత్రీ మూవీ మేకర్స్’ సినిమాలో నటిస్తున్నారు.  కళ్యాణ్ రామ్ కు 19వ చిత్రమిది. రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు.

క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

ఈ చిత్రంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, ఆషిక రంగ‌నాథ్‌, బ్ర‌హ్మాజీ, స‌ప్త‌గిరి, జ‌య‌ప్ర‌కాష్‌, మాథ్యూ వ‌ర్గీస్‌, రాజీవ్ పిళ్లై, ర‌వి ప్ర‌కాష్‌, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ‌, ర‌ఘు కారుమంచి, మాణిక్ రెడ్డి, గబ్బ‌ర్ సింగ్ సాయి, శ్రీధ‌ర్‌, అశోకన్‌ విన్సెంట్, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు న‌టించారు.

Also Read: ద‌స‌రా నుంచి బింబిసార 2 క‌థ స్టార్ట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్