Sunday, January 19, 2025
Homeసినిమాకల్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్టే!

కల్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్టే!

Movie Review: దేనికైనా కాలం కలిసి రావాలని అంటారు. అలాంటి కాలం ఇప్పుడు కల్యాణ్ రామ్ కి అనుకూలంగా మారిందనే చెప్పాలి. కల్యాణ్ రామ్ ఇండస్ట్రీలో హీరోగా .. నిర్మాతగా చాలా కాలం నుంచి ఉన్నాడు. హీరోగాను .. నిర్మాతగాను ఆయనకి సక్సెస్ లు పడిన సందర్భాలు చాలా తక్కువనే. అయినా పట్టువీడకుండా ప్రయోగాలు చేస్తూనే వెళుతున్నాడు. ఒక కొత్త దర్శకుడి చేతిలో 40 కోట్ల ప్రాజెక్టుగా ‘బింబిసార’ పెట్టడం ఆయనకి మాత్రమే చెల్లింది.

అలాంటి కల్యాణ్ రామ్ ఆ సినిమా తరువాత కూడా హీరోగా మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. అలా  రూపొందిన ‘అమిగోస్’ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను రాజేంద్ర తెరకెక్కించాడు. ప్రపంచంలో ఒకే పోలికతో ఏడుగురు మనుషులు ఉంటారు. వాళ్లను కలుసుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా ఇది. తనని పోలిన వ్యక్తిని కలుసుకుని హీరో ఎలాంటి చిక్కుల్లో పడ్డాడనేదే ఈ కథలోని సారాంశం.

హీరోగా .. విలన్ గా .. కాస్త అమాయకుడిగా కల్యాణ్ రామ్ మూడు పాత్రల్లోను మెప్పించాడు. ఏ పాత్రకి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చునని అడిగితే మాత్రం .. విలన్ రోల్ కే అని చెప్పచ్చు. ఇక ఆషిక రంగనాథ్ విషయానికి వస్తే .. ఈ మధ్య కాలంలో తెరకి పరిచయమైన కథానాయికలలో గ్లామర్ కాస్త ఎక్కువగానే ఉన్న అమ్మాయని చెప్పాలి. ముగ్గురు కల్యాణ్ రామ్ లు .. హీరోయిన్ ను పక్కన పెట్టేస్తే, పెద్ద తారాగణమేదీ కనిపించదు. అలాగని చెప్పేసి కథ బోర్ కొట్టదు.

రాజేంద్ర కి రైటర్ గా మంచి అనుభవం ఉంది. అందువలన ఇంట్రెస్టింగ్ గా ఉండే కథను ఎంచుకున్నాడు .. అందుకు తగినట్టుగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ప్రధానమైన పాత్రలు తక్కువే అయినా, బాగా డిజైన్ చేసుకున్నాడు. ఇక వీటికి జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. మంచి ఫొటోగ్రఫీ తోడయ్యాయి. వెంకట్ ఫైట్స్ కూడా ఆకట్టుకుంటాయి. అన్ని అంశాలను బట్టి చూస్తే, కల్యాణ్ రామ్ ఖాతాలో మరో సక్సెస్ పడినట్టేనని చెప్పక తప్పదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్