Sunday, January 19, 2025
HomeసినిమాNo Troll: 'చిరు'పై విమర్శలు- యంగ్ హీరో గుస్సా

No Troll: ‘చిరు’పై విమర్శలు- యంగ్ హీరో గుస్సా

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళాశంకర్. మెహర్ రమేష్ రూపొందించిన ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశలు పెట్టుకున్నా ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. చిరంజీవి కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.  చిరంజీవిపై కూడా విమర్శలు వచ్చాయి.

చిరు తన వయసుకు తగ్గ పాత్రలు చేయాలని.. ఇంకా డ్యూయెట్లు ఏంటని కామెంట్ చేశారు.  ‘ఖుషి’ సీన్ పై ట్రోలింగ్ బాగా జరిగింది. చిరు కెరీర్ లో భారీ డిజాస్టర్ ఆచార్య అనుకుంటే… భోళాశంకర్ అంతకు మించి  బోల్తా కొట్టింది. చిరంజీవి తెలిసి చేసిన తప్పు అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తుంటే… కాదు.. నాకు అంతా తెలుసు అనుకుని ఏమీ తెలుసుకోలేకపోవడం వలన చేసిన తప్పు అని మరి కొంత మంది కామెంట్స్ చేశారు.

అయితే… ఈ విమర్శలపై ఆర్ ఎక్స్-100 హీరో కార్తికేయ బాగా ఫీలవుతున్నాడట. కార్తికేయ ఇప్పుడు బెదురులంక 2012 అనే సినిమా చేశాడు. ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన కార్తికేయ మాట్లాడుతూ.. సినిమా నచ్చకపోతే నచ్చలేదని.. చెప్పడం వరకు ఫరవాలేదు కానీ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నాడు. చిరంజీవినే కాదు ఎవరినీ అలా అనద్దన్నాడు. ఆయన్ని విమర్శిస్తుంటే.. చాలా బాధగా ఉందన్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్