Tuesday, May 14, 2024
HomeTrending Newsహామీల అమలుకు సిఎం మెడలు వంచుతా - కెసిఆర్

హామీల అమలుకు సిఎం మెడలు వంచుతా – కెసిఆర్

కాని పోనీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, సిఎం రేవంత్ రెడ్డి మేడలు వచ్చి హామీలు అమలు చేయించే బాధ్యత తనదని కెసిఆర్ అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కెసిఆర్ మరోసారి పునరుద్గాటించారు. మొన్న అడ్డ‌గోలు హామీలిచ్చి దుష్ర్ప‌చారాలు చేసి కేవ‌లం ఒక‌టిన్న‌ర శాతం ఓట్ల‌తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిందన్నారు.

నాగర్ కర్నూల్ ఎంపి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తరపున నాగర్ కర్నూల్ లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బిజెపిల వఫల్యాలను కెసిఆర్ ఏకరువు పెట్టారు. తెలంగాణలో ప్రజల గొంతుక వినిపించాలంటే బీఆర్ఎస్ ఉండాలని కెసిఆర్ అన్నారు. ముస్లింల ఓటు కాంగ్రెస్ కు పడితే బిజెపి గెలుస్తుందని అన్నారు.

కొత్త ప్రభుత్వంలో పథకాలు వస్తున్నాయ అని కెసిఆర్ ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పెడితే కొనే దిక్కు లేదు. వాన‌ల‌కు త‌డిసిపోతుంది త‌ప్ప‌ కొనే దిక్కు లేదు. ఈ ప్ర‌భుత్వం ప‌రిస్థితి ఇదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే క‌రెంట్ 24 గంట‌లు ఇచ్చాం. రెప్ప‌పాటు క‌రెంట్ పోలేదు. కాంగ్రెస్ రాజ్యంలో క‌రెంట్ పోతుందన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 225 మంది రైతులు చ‌నిపోయారు. కొంద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కొంద‌రు క‌రెంట్ షాకుల‌తో, పాములు క‌ర‌వ‌డంతో చ‌నిపోయారు. ఈ బాధ ఎందుకు వ‌చ్చిందో ఆలోచ‌న చేయండి. కేసీఆర్ పెట్టిన ప‌థ‌కాలు ఇవ్వాలి క‌దా.. కొత్త‌గా గ‌డ్డ‌పార పెట్టి త‌వ్వాల్సిన అవ‌స‌రం లేదు క‌దా..? అని కేసీఆర్ మండిపడ్డారు.

బిజెపి అక్కరకు రాని చుట్టమని కెసిఆర్ ఎద్దేవా చేశారు. సబ్ కా సాత్ అని ప్రజలను మోసం చేశారు. వికసిత్ భారత్ నినాదంతో వికసించిందా అని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించమంటే పట్టించుకోలేదు. మోటర్లకు మీటర్లు పెట్టమని అంటే నా మెడ నరికినా పెట్టని అని తెగేసి చెప్పానన్నారు. బిజెపికి ఓటు వేస్తే మోటార్లు పెట్టడం ఖాయం అన్నారు.

మహబూబ్ నగర్‌లో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో స్థానిక గురుకుల విద్యార్థులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

అంతకు ముందు గురుకులాల్లో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్తునులు కెసిఆర్ ను కలిశారు. ఉన్నత స్థానాలు అధిరోహించాలని కెసిఆర్ వారిని అభినందించారు. కొడంగల్ కేజీబీవీలో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అనూష తదితరులు కేసీఆర్ గారిని కలిసిన వారిలో ఉన్నారు.

కేసీఆర్‌ బస్సుయాత్రకు దారి పొడవున అభిమానులు స్వాగతం పలికారు. మహబూబ్ నగర్ నుంచి భూత్ పూర్, గొప్లపూర్, కొత్త మొలగర, వెలికిచర్ల, ఆల వెంకటేశ్వర్ రెడ్డి కాలనీ, బట్టు పల్లి తండాలో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న గులాబీ దళం కెసిఆర్ పర్యటనతో మళ్ళీ గాడిలో పడుతోంది. కెసిఆర్ పర్యటించిన ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి మెరుగుపడుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్