Wednesday, May 15, 2024
HomeTrending Newsబాబును నమ్మితే చంద్రముఖిని నిద్రలేపడమే - సిఎం జగన్

బాబును నమ్మితే చంద్రముఖిని నిద్రలేపడమే – సిఎం జగన్

మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లుతో కూటమి జెండాలు జతకట్టి వస్తున్నారని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు, అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు తమ నైజంగా, కూటమిగా, గుంపులు గుంపులుగా.. జెండాలు జతకట్టుకుని వారంతా వస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆదివారం సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏమన్నారంటే..:

మీ ఒక్కడు జగన్ మీద, మీకు మంచి చేసిన ఒక్క జగన్ మీద ఈ పేదల వ్యతిరేకులను, ఈ మోసగాళ్లను మన ఓటుతో పోలింగ్‌లో వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి.

బాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే… బాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో. నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద. నా మేనిఫెస్టోను నూటికి 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఖురాన్, భగవద్గీతగా భావించి మంచి చేసి, ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దెవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడు.

ఎప్పుడైనా మీరు ఊహించారా? ఎప్పుడైనా ఎవరైనా చెబితే నమ్మేవారా? గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మీ వద్దకు వస్తాయి అంటే.. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా మీకు చెప్పి ఉంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతున్నాను.

ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తుమారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటళ్లు మెరుగు పడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా?

మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లో ఉండాలి. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు మరొక్కసారి కోరుతూ మీ బిడ్డ సెలవు తీసుకుంటున్నాడు. అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్