కుటుంబ నేపథ్యం :
కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్. తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె, ఢిల్లీలో కోచింగ్ తీసుకుని సివిల్స్ రాశారు. 2013లో నేషనల్ లెవెల్లో 89వ ర్యాంకు సాధించిన కీర్తి… శిక్షణ అనంతరం అసోంలో విధుల్లో చేరారు.
మచ్చుకు ఒక సందర్భం:
గత సంవత్సరం సెప్టెంబర్ 10. అసోం లోని కచార్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన సిల్చార్ లో కొంతమంది ఉన్నతాధికారులకు మేసెజ్ పంపించింది కలెక్టర్ కీర్తి. మా ఇంట్లో వినాయక పూజ ఉంది రమ్మని. అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ మరో పాతిక మంది కనిపించారు. వారికి అప్పుదు తెలిసింది తాము వచ్చింది కేవలం వినాయక పూజకే కాదు. కలెక్టర్ గారి పెళ్ళికి అని. అంత నిరాడంబరంగా ఆమె పెళ్ళి జరిగిపోయింది.
అది కరోనా సమయం కావడంతో పెళ్ళైన మరుసటిరోజు నుండే మళ్ళీ డ్యూటీలో నిమగ్నం అయిపోయింది.
హైదరాబాద్ లో ఉన్న తల్లిదడ్రులు కోవిడ్ తో బాధ పడుతున్నా తాను మాత్రం అసోం లోనే కోవిడ్ సేవల్లో నిమగ్నమైపోయింది.
అంతేకాదు గతంలో మరెన్నో విషయాల్లో తన ప్రతిభను కనబరిచి ఎన్నెన్నో ప్రశంసలు అందుకుంది. అవన్నీ చెబితే నిడివి ఎక్కువ అవుతుంది.