Monday, February 24, 2025
HomeసినిమాKiran Abbavaram: 'రూల్స్ రంజన్' హిట్టు పట్టుకుపోయేనా?

Kiran Abbavaram: ‘రూల్స్ రంజన్’ హిట్టు పట్టుకుపోయేనా?

కిరణ్ అబ్బవరం తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి వరుస సినిమాలతో తన దూకుడు చూపించాడు. దాంతో బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉందని చాలామంది అనుకున్నారు.  ఎలాంటి సినిమా నేపథ్యం లేదనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి చాలామందికి చాలా సమయమే పట్టింది. అయితే కిరణ్ నుంచి థియేటర్స్ కి సినిమాలు వచ్చినంత వేగంగా సక్సెస్ లు రాలేదు. దాంతో కుర్రాడు ఆలోచనలో పడ్డాడు. సరైన కథ పడాలనే పట్టుదలతో ఈ సారి కాస్త గ్యాప్ తీసుకున్నాడు.

అలా ఆయన చేసిన సినిమానే ‘రూల్స్ రంజన్’. రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, క్రితం నెల 28వ తేదీన థియేటర్లకు రావలసింది. కానీ కొన్ని కారణాల వలన, ఈ నెల 6వ తేదీకి వాయిదా పడింది. కిరణ్ అబ్బవరం జోడీగా ఈ సినిమాలో నేహా శెట్టి మెరవనుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్ తో కూడిన రొమాన్స్ తో పాటు, కావలసినంత కామెడీ ఉందనే విషయం కూడా అర్థమైంది.

అయితే ఆ రోజున దాదాపు అరడజను సినిమాలు బరిలో ఉన్నాయి. అన్నీ చిన్న సినిమాలే కదా అని,  గతంలో మాదిరిగా తేలికగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే, చిన్న సినిమాలు ఎంత పెద్ద హిట్లు ఇస్తున్నాయనేది అనుభవంలోకి వచ్చిందే. అందువలన ఈ సినిమాలలో  ఏది నిలబడుతుందనేది చెప్పలేం. ఇంతపోటీ మధ్యలో వస్తున్న ‘రూల్స్ రంజన్’ హిట్ పట్టుకు పోతుందేమో  చూడాలి. తనకి హిట్టు చాలా అవసరం అనే విషయం మాత్రం కిరణ్ కి బాగా తెలుసు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్