దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ.. రాహుల్ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీతోపాటు వారికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, కాంగ్రెస్ పార్టీయే తన విధానాలతో ప్రమాదంలో పడిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
మంగళవారం పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పు కారణంగా పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేతలు, వారికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు.. ఇప్పుడు కోర్టు తీర్పులను కూడా తప్పుబడుతుండటం హాస్యాస్పదమన్నారు.
కోర్టు నిర్ణయం కారణంగా..పార్లమెంటు సభ్యులో, శాసనసభ్యులో తమ సభ్యత్వాన్ని కోల్పోయిన సందర్భం ఇదే మొదటిది కాదని.. ఇటీవలి కాలంలో.. లక్షద్వీప్ కు చెందిన ఎండీ ఫైజల్, అంతకుముందు తమిళనాడు సీఎం జయలలిత వంటి ఎందరో కోర్టు తీర్పుల కారణంగా సభ్యత్వానికి దూరమైన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రస్తావించారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ చిలుకపలుకులు పలుకుతున్న రాహుల్ గాంధీ.. ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూడాలని కేంద్రమంత్రి సూచించారు. తన మాట కాదన్నందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ 50 సార్లు.. ఆ ఒక్క కుటుంబమే 76 సార్లు ఆర్టికల్ 356ని (రాష్ట్రపతి పాలన) ప్రయోగించి.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. స్వయంగా రాహుల్ గాంధీయే.. కేబినెట్ చేసిన ఆర్డినెన్స్ ను మీడియా ముందు చించేయడం రాజ్యాంగబద్ధమైనదా? ప్రజాస్వామ్య బద్ధమైనదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వతతో నోటిదురుసు వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. దాన్ని సమర్థించుకోవడం హాస్యాస్పదమని కేంద్రమంత్రి అన్నారు. కాంగ్రెస్, రాహుల్ పార్లమెంటు సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలు.. వారి వారి రాష్ట్రాల్లో ఎంతవరకు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నారో చూసుకోవాలన్నారు. గురివింద గింజ నీతులు చెప్పడం మానుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇందిరాగాంధీ అలహాబాద్ కోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకించి ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని రాహుల్ గుర్తుతెచ్చుకుంటే బాగుంటుందని కేంద్రమంత్రి సూచించారు.
2013 నుంచి దేశ వ్యాప్తంగా అనర్హతకు గురైన ఎంపీలు/ఎమ్మెల్యేల జాబితాను కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో అన్ని పార్టీల నేతలున్నారని అప్పుడు ఎవరూ.. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ప్రకటనలు చేయలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
2013 నుంచి దేశవ్యాప్తంగా అనర్హతకు గురైన ప్రజాప్రతినిధులు:
• రాహుల్ గాంధీ (కాంగ్రెస్) – 2023.
• PP ఎండీ ఫైజల్ (లక్షద్వీప్-కాంగ్రెస్) 2023
• ఆజం ఖాన్ (SP) – 2022
• అనంత్ సింగ్ (RJD) – 2022
• అనిల్ కుమార్ సహానీ (RJD) – 2022
• విక్రమ్ సింగ్ సైనీ (BJP) – 2022
• ప్రదీప్ చౌదరి (Congress, Haryana) – 2021
• జె. జయలలిత (AIADMK) – 2017.
• కమల్ కిషోర్ భగత్ (ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్) – 2015.
• సురేష్ హల్వంకర్ (BJP) – 2014.
• T. M. సెల్వగణపతి (DMK) – 2014.
• బాబన్‌రావ్ ఘోలప్ (శివసేన) – 2014
• ఎనోస్ ఎక్కా (జార్ఖండ్ పార్టీ) – 2014
• ఆశా రాణి (BJP) – 2013
• రషీద్ మసూద్ (Congress) – 2013
• లాలూ ప్రసాద్ యాదవ్ (RJD) – 2013.
• జగదీష్ శర్మ (JDU) – 2013.
• పప్పు కలానీ (Congress) 2013.
Also Read : Rahul Gandhi Disqualified:రాహుల్ గాంధిపై అనర్హత వేటు