Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్బెంగుళూరుకు భంగపాటు

బెంగుళూరుకు భంగపాటు

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై ఘన విజయం సాధించింది. అబుదాబీ లోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. కోల్ కతా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 19 ఓవర్లలో 92 పరుగులకే  బెంగుళూరు కుప్పకూలింది.

టాస్ గెలిచిన బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్ రెండో ఓవర్లోనే కోహ్లీ 5 పరుగులు చేసి ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రీకర్ భరత్ ఓపెనర్ పడిక్కల్ తో కలిసి ఇన్నింగ్ దారిలో పెట్టేందుకు యత్నించాడు. జట్టు స్కోరు 41వద్ద 22 పరుగులు చేసిన పడిక్కల్ ఫెర్గ్యుసన్ బౌలింగ్ లో దినేష్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే ఏబీ డివిలియర్స్ కూడా డకౌట్ కావడంతో బెంగుళూరు కష్టాల్లో పడింది. ఆ తర్వాత మాక్స్ వెల్ (10), హర్శల్ పటేల్ (12) మినహా మిగిలిన వారెవ్వరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. కోల్ కతా బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, అండీ రస్సెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ కృష్ణకు రెండు వికెట్లు లభించగా, ఫెర్గ్యుసన్ ఒక వికెట్ తీశాడు.

కోల్ కతా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పది ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్ శుభమన్ గిల్  34 బంతుల్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్లతో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 27బంతుల్లో 1సిక్సర్,  7ఫోర్లతో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. బెంగుళూరు బౌలర్ యుజేంద్ర చాహల్ కు ఒక వికెట్ దక్కింది.

4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన కోల్ కతా బౌలర్ వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్