Saturday, November 23, 2024
HomeTrending Newsకొండపల్లి ఎన్నిక పూర్తి

కొండపల్లి ఎన్నిక పూర్తి

AP HC do decide Kondapalli Municipal Chairman:
వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఫలితాన్ని తాము ప్రకటిస్తామని హైకోర్టు నిన్న ఆదేశించినందున అధికారికంగా ఎవరు ఎన్నికయ్యారో వెల్లడించకపోయినా తెలుగుదేశం పార్టీకి 16, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15 ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. సీల్డ్ కవర్ లో నివేదికను కాసేపట్లో హైకోర్టుకు మున్సిపల్ అధికారులు అందజేయనున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున చెన్నుబోయిన చిట్టిబాబు, వైఎస్సార్సీపీ తరఫున జోగి రాము చైర్మన్ అభ్యర్ధులుగా పోటీ చేశారు.

విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఎక్స్ అఫీషియో ఒటుపై తాము తుది నిర్ణయం తీసుకుంటామని, చైర్మన్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించి తమకు నివేదిక అందించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించి తమకు సమర్పించాలని కూడా ఉన్నత న్యాయస్థానం నిన్నటి తీర్పులో వెల్లడించింది. ఈ మేరకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయం చుటూ బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.

మరోవైపు కేశినాని నాని ఓటు విషయమై హైకోర్టులో బలమైన వాదనలు వినిపించలేకపోయామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అభిప్రాయపడ్డారు. గతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో తన ఎక్స్ అఫీషియో ఓటును నమోదు చేసుకున్న కేశినేని హఠాత్తుగా ఇప్పుడు కొండపల్లికి మారడం చట్టపరంగా చెల్లదని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ కోర్టు నిర్ణయమే శిరోధర్యమని వ్యాఖ్యానించారు.

Also Read : శాసనమండలి రద్దు నిర్ణయం వెనక్కి: బుగ్గన

RELATED ARTICLES

Most Popular

న్యూస్