Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ క‌పూర్?

ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ క‌పూర్?

Janvi with Junior: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో ఓ భారీ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని ఇప్ప‌టికే సెట్స్ పైకి తీసుకెళ్లాలి కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆల‌స్యం అయ్యింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జులై లేదా ఆగ‌ష్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే.. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రనేది ఆస‌క్తిగా మారింది.

కార‌ణం ఏంటంటే… ముందుగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ అనుకున్నారు. ఆమె కూడా ఈ సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పింది. అయితే… పెళ్లి చేసుకోవ‌డం.. ఆత‌ర్వాత వేరే సినిమాల్లో బిజీ కావ‌డం.. హాలీవుడ్ మూవీలో కూడా న‌టిస్తుండ‌డంతో ఆలియా ఎన్టీఆర్ తో మూవీకి నో చెప్పాల్సివ‌చ్చింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా కోసం హీరోయిన్ ని వెతికే ప‌నిలో ప‌డ్డారు కొర‌టాల‌. ఇప్పటి వరకు రష్మిక మందన్నాతో పాటు బాలీవుడ్‌ హీరోయిన్స్‌  జాన్వీ కపూర్‌, దిశా పటానీ, అనన్య పాండే పేర్లు తెర పైకి వచ్చాయి.

తాజా స‌మాచార‌ ప్రకారం.. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ అయితేనే బాగుటుందని చిత్ర బృందం అభిప్రాయపడుతుందట. దీంతో జాన్వీని ఈ సినిమాకు ఫైనల్‌ చేయాలనే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొరటాల బృందం జాన్వీని సంప్రదించబోతున్నారనే టాక్‌ గట్టిగా వినిపిస్తోంది. జాన్వీని ఒప్పించేందుకు అన్ని విధాల ప్లాన్‌ చేస్తున్నారట కొరటాల. ఎన్టీఆర్ సినిమా కాబ‌ట్టి ఓకే అంటుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి.. జాన్వీ ఎస్ అంటుందో..?  నో అంటుందో..? చూడాలి.

Also Read : ఎన్టీఆర్, కొర‌టాల మూవీలో భారీ మార్పులు?  

RELATED ARTICLES

Most Popular

న్యూస్