Sunday, November 24, 2024
HomeTrending Newsరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన కెసిఆర్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన కెసిఆర్

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ మొదటగా మంత్రి కేటిఆర్ ఓటు వేయగా   అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు వేశారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మాక్‌ పోలింగ్‌కు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి బస్సుల్లో నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు.


విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్మా, బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నికల భరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఈ నెల 21న ఫలితాలను వెల్లడిస్తారు. కాగా, ఈఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ 132. మొత్తం 119 మందికి సంబంధించిన ఓట్ల విలువ 15,708

Also Read : రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సిఎం, స్పీకర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్