విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ విడుదల అవుతోంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. S P జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకం పై నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. లాయర్ శ్రీరామ్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
విజయ్ సేతుపతి నటించిన మాస్టర్, ఉప్పెన తరువాత తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘లాభం’ చిత్రం సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఇలా రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి చిత్రం విడుదల కావడం విశేషం’ అన్నారు.