వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతోంది. సెన్సార్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రం నుండి ‘కోలో కోలో కోయిలా’ సాంగ్ లిరికల్ వీడియోను నిర్మాతలు విడుదల చేశారు. మారేడుమిల్లి వాసుల సంబరాలను ఈ పాట కన్నుల పండువగా ఆవిష్కరించింది. తమ జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నించే అల్లరి నరేష్ కు గ్రామస్తులు ఘనస్వాగతం పలకడంతో పాట ప్రారంభమవుతుంది. దేవుడిని ప్రార్థించడమే కాకుండా, ఆఫీసర్ చేసిన అన్ని మంచి పనులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీచరణ్ పాకాల అందించిన పాట ఫోక్ బీట్ లతో చాలా ఎనర్జిటిక్ గా ఉంది. జావేద్ అలీ, మోహన భోగరాజు, యామిని ఘంటసాల ఈ పాటని హుషారుగా ఆలపించగా , కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. అల్లరి నరేష్ తెల్ల చొక్కా, పంచెలో కనిపించారు. ఈ పాటకు అల్లరి నరేష్ చేసిన డ్యాన్సులు అద్భుతంగా ఉన్నాయి. ఆనంది హాఫ్ శారీలో అందంగా కనిపించింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాంరెడ్డి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.