Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌ మూవీలో రమ్యకృష్ణ..?

మహేష్‌ మూవీలో రమ్యకృష్ణ..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు రూపొందడం ఈ రెండు చిత్రాలు మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇన్నాళ్లకి ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో మహేష్ కు జంటగా క్రేజీ హీరోయిన్స్ పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే.. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో ఓ కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రకు సీనియర్ హీరోయిన్ శోభనను తీసుకోవాలి అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆమెను కాంటాక్ట్ చేశారట. హైదరాబాద్ వచ్చి ఈ మూవీ మేకర్స్ ని కలిసిందట కానీ.. ఆ ప్రాజెక్ట్ విషయంలో ఆమె అంతగా ఇంట్రస్ట్ చూపించలేదట. అలాగని నటించను అని చెప్పలేదట. ఆలోచించి చెబుతా అన్నదట. దీంతో వేరే ఆప్షన్ గా రమ్యకృష్ణ అయితే బాగుంటుంది అనుకుంటున్నారని సమాచారం. బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ పెరిగింది. అప్పటి నుంచి వరుసగా చాలా సినిమాల్లో నటిస్తూ కెరీర్లో బిజీగా ముందుకెళ్తోంది.

ఈ క్రమంలోనే ఆమె త్రివిక్రమ్ సినిమా కూడా ఓకే చెప్తుందని సినీవర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయట. మరి.. శోభన, రమ్యకృష్ణ ఈ ఇద్దరిలో ఎవరు ఈ సినిమాలో నటిస్తారో అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ మూవీ తర్వాత మహేష్‌, రాజమౌళితో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు కానీ.. దసరాకి విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్