Sunday, January 19, 2025
HomeసినిమాSSMB28: మహేష్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

SSMB28: మహేష్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరి కలయికలో వస్తున్న మూడవ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో క్రేజీ హీరోయిన్స్ పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని వార్తలు వచ్చాయి కానీ.. అసలు కథ ఏంటి..? మహేష్‌ బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? అనేది బయటకు రాలేదు. ఇప్పుడు మహేష్‌ క్యారెక్టర్ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే… ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ కి ఓ క్రేజీ డిసీజ్ ఉంటుందని.. ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే ఈ డిసీజ్ కథను మలుపు తిప్పుతుందని ప్రచారం జరుగుతుంది. పైగా సెకండ్ హాఫ్ కథ మొత్తం ఈ డిసీజ్ చుట్టే తిరుగుతుంది అని తెలుస్తోంది. అయితే.. ఆ డిసీజ్ ఏమిటీ అనేది మాత్రం బయటకు రాలేదు.  కథానాయకుడుకు డిసీజ్ అంటే.. అది కథలో ఎంతో కీలకం అయ్యి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎంతైనా… త్రివిక్రమ్ ఈ కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు. ఈ వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు కథ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగా ఇది నిజమా కాదా అనేది కూడా తెలియాల్సివుంది.

మహేష్, త్రివిక్రమ్ కలయికలో అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వరుస విజయాలు సాధిస్తున్న మహేష్‌ ఈ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్