Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్‌, త్రివిక్ర‌మ్ చ‌ర్చ‌లు ఎక్క‌డో తెలుసా..?

మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ చ‌ర్చ‌లు ఎక్క‌డో తెలుసా..?

Discussions: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో మూవీ ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. కార‌ణం ఏంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు త్రివిక్ర‌మ్ మ‌హేష్ బాబుకు పూర్తి స్థాయిలో క‌థ చెప్ప‌లేద‌ట‌. అందుక‌నే కృష్ణ పుట్టిన‌రోజుకు ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ చేయ‌లేద‌ని తెలిసింది. దీంతో ఈ సినిమా క‌థ‌ను త్రివిక్ర‌మ్ మ‌హేష్ కి ఎప్పుడు చెబుతారు..? ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంద‌ని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

తాజా అప్ డేట్ ఏంటంటే.. సర్కారు వారి పాట సినిమా విడుదల తరువాత ఫ్యామిలీతో జర్మనీలో వున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్వరలో త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా మొదలుపెట్టాల్సి వుంది. అయితే.. మహేష్ జర్మనీ నుంచి వచ్చే వరకు వెయిట్ చేస్తే ఆల‌స్యం అవుతుంద‌ని.. త్రివిక్రమ్ నే జర్మనీ కి బయల్దేరి వెళ్లారని స‌మాచారం. అక్కడ ఆయన వారం రోజులు వుండి మ‌హేష్ కు ఫుల్ స్టోరీ నెరేష‌న్ ఇవ్వ‌నున్నారు. అలాగే ఈ సినిమాలో న‌టించే సెకండ్ హీరో ఎవ‌రు అనేది కూడా ఫైన‌ల్ చేస్తార‌ట‌.

త్రివిక్రమ్ తో పాటు సంగీత దర్శకుడు థమన్, నిర్మాత నాగ‌వంశీ కూడా వెళ్లారు. ఈ సినిమాను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్రారంభించి సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నేది ప్లాన్. మ‌రి.. సంక్రాంతికి వ‌స్తుందో.. స‌మ్మ‌ర్ కి వ‌స్తుందో చూడాలి.

Also Read : మ‌హేష్ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న త్రివిక్ర‌మ్. ? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్