Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ ICC Men’s T20 World Cup 2022: న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షార్పణం

 ICC Men’s T20 World Cup 2022: న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షార్పణం

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో నేడు న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ లభించింది.

నేటి ఉదయం ఇదే గ్రౌండ్ లో ఇంగ్లాండ్- ఐర్లాండ్ మధ్య జరిగిన  మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయూస్ (డిఎల్ఎస్) ప్రకారం ఐర్లాండ్ గెలుపొందినట్లు ప్రకటించారు.

ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఆసీస్ ను ఓడించి మంచి ఊపు మీదున్న కివీస్ జట్టు ఈ మ్యాచ్ రద్దు కావడంతో డీలా పడింది.  మొన్న సౌతాఫ్రికా-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఫలితం తేలకపోవడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ దక్కింది.

ఈ మెగా టోర్నీలో ఇలా వర్షం కారణంగా పలు మ్యాచ్ లు రద్దు కావడంతో క్రికెట్ జట్లతో పాటు క్రీడాభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్