Sunday, January 19, 2025
Homeసినిమామెగా కంఠంలో నేనొక నటుడ్ని షాయరీ

మెగా కంఠంలో నేనొక నటుడ్ని షాయరీ

రంగమార్తాండ‘ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యింది. మెగస్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీ ను రచయిత లక్ష్మీ భూపాల రచించారు. మాస్ట్రో ఇళయరాజా నేపధ్య సంగీతం అందించారు. ఈ షాయరీ వినే ప్రతి నటుడు తన కోసమే రాశారని భావించేలా లక్ష్మీ భూపాల ఎంతో అర్థవంతంగా రాశారు. మెగాస్టార్ అద్భుతంగా తన గొంతులో నవరసాలు పలికించి ఈ షాయిరీకి ప్రాణం పోశారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ రంగమార్తాండ సినిమాకు ఈ షాయరీ అద్దం పడుతోంది.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Also Read : కృష్ణవంశీ రంగమార్తాండ టైటిల్ లోగో విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్