Saturday, January 18, 2025
Homeసినిమా'మెగా154' టైటిల్ టీజర్ రిలీజ్ డేట్

‘మెగా154’ టైటిల్ టీజర్ రిలీజ్ డేట్

చిరంజీవి, డైరెక్టర్ బాబీ, మైత్రీ మూవీ మేకర్స్‌ ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘మెగా154’. ఈ చిత్రానికి సంబధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా ‘మెగా154‘ రూపుదిద్దుకుంటోంది.

ఈ మూవీ టైటిల్ టీజర్‌ను దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటివలే మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 24న ఉదయం 11:07 గంటలకు టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు  ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో చిరంజీవి మాస్ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్ పై ‘బాస్ వస్తున్నాడు’ అని రాయడం అంచనాలని మరింత పెంచేసింది.

సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154 కోసం ప్రముఖ నటీన‌టులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Also Read : మెగా154 లో రవితేజ మెగా మాస్ ఎంట్రీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్