Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్జగన్ వెంటే జనం: అవంతి

జగన్ వెంటే జనం: అవంతి

ఎన్నికలు ఏవైనా ప్రజలు సిఎం జగన్ వెంటే నిలుస్తున్నారని, ఇటీవల జరిగిన కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికలే దీనికి నిదర్శనమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖపట్నం నగర పాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్ గా సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో అవంతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ సిఎం జగన్ సూచన మేరకు దళిత వర్గానికి చెందిన సతీష్ డిప్యుటీ మేయర్ పదవి కట్టబెట్టామని, ఈ విషయమై తెలుగుదేశం మినహా మిగిలిన అన్ని పక్షాలూ తమను అభినందించాయని చెప్పారు.  చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూసారని, వారి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అవంతి ఆరోపించారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్