Saturday, November 23, 2024
HomeTrending Newsఎక్కువ మందికి అవకాశం: పెద్దిరెడ్డి

ఎక్కువ మందికి అవకాశం: పెద్దిరెడ్డి

Mining Reforms: మైనింగ్ లో – ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకే ‘ఈ-ఆక్షన్’ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగంలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకు వచ్చారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం డిఏంజి కార్యాలయంలో లీజుదారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మైన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ దివ్వేది, డిఎంజి విజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త విధానం ఔత్సాహికులకు ప్రోత్సాహకరంగా ఉందని, పారదర్శకతతో, వేగంగా లీజుల జారీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్కువ క్వారీలను ఆపరేటింగ్ లోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మైనింగ్ ఆధారిత పరిశ్రమలు పెరిగితే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ విధానం పై లీజుదారుల సహకారం కోరుతున్నామని, లీజుదారుల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.  ఎక్కడైనా సమస్యలు ఉంటే సీఎం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని లీజుదారులకు పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు.

Also Read : నగర వనాల అభివృద్ధి: పెద్దిరెడ్డి సూచన 

RELATED ARTICLES

Most Popular

న్యూస్