Sunday, April 27, 2025
HomeTrending Newsనేడు మునుగోడుకు ఐదుగురు మంత్రులు

నేడు మునుగోడుకు ఐదుగురు మంత్రులు

తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత వచ్చిన తొలి ఉప ఎన్నిక మునుగోడులో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో విజయదుందుబి మోగించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణపై బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేవిధంగా మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం నేడు మంత్రులు వెలుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రులు కేటిఆర్, జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రశాంత్ రెడ్డి ఈ రోజు (01.12.2022) మునుగోడులోని ధనలక్ష్మీ ఫంక్షన్ హాల్ ఉదయం 11 గంటలకు సమీక్షించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం ముఖ్యమంత్రి కేసిఆర్  ఇచ్చిన హామీలకు చేపట్టవలసిన చర్యలపై ఐదుగురు మంత్రులు సమీక్ష చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్