Monday, January 20, 2025
HomeTrending Newsటీఎస్ పీఎస్సీ బోర్డ్ రద్దు చేయాలి - ఈటల రాజేందర్

టీఎస్ పీఎస్సీ బోర్డ్ రద్దు చేయాలి – ఈటల రాజేందర్

టీఎస్ పీఎస్సీ లో రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలన్నారు. నైతిక బాధ్యత వహించి సీఎం కెసిఆర్ రాజీనామా చెయాలని, టీఎస్ పీఎస్సీ ప్రస్తుత బోర్డ్ ను రద్దు చేసి కొత్త బోర్డ్ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ని కలిసిన ఈటల రాజేందర్, బీజేపీ నేతలు. టీఎస్ పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు.

ఆ తర్వాత మీడియాతో ఈటలరాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ విద్యార్థుల కళ్ళలో మట్టి కొట్టారని, కెసిఆర్ కి రాజకీయాలు తప్ప తెలంగాణ ప్రజల పట్టింపు లేదని ఘాటుగా విమర్శించారు. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈటెల విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యువత బరిగీసి కొట్లాడాలని, ప్రభుత్వ మెడలు వంచుదామన్నారు. అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని గవర్నర్ ని కోరామని, ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆరోపించారు. కేసీఆర్ ఆరాటం అంతా కుర్చీ పైనే ఉందని, పెన్ డ్రైవ్ లో పేపర్లు దొంగిలిస్తే TSPSC ఎం చేస్తుందని ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఎందుకు పనిచేయడం లేదని, రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.

Also Read : తెలంగాణ గ్రూప్ వన్ పరీక్ష రద్దు…జూన్‌ 11న మళ్ళీ ప్రిలిమ్స్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్