ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థన తోసిపుచ్చిన హైకోర్టు…ఈనెల 30న హాజరు కావాలన్న ఈడీ సమన్లలో జోక్యానికి నిరాకరించింది. ఈడీ కేసు కొట్టివేయాలన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ విచారణ చేశారు.
రోహిత్‌రెడ్డి తరఫున వైకాపా ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పార్టీ మారాలని తనకు వందకోట్లు ఆఫర్ ఇచ్చారన్న రోహిత్‌రెడ్డి…ఆఫర్ మాత్రమే చేశారు కాని డబ్బు ఇవ్వలేదని చెప్పారు. ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదని రోహిత్ రెడ్డి న్యాయవాది వాదించారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమన్న రోహిత్‌రెడ్డి…వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందని న్యాయస్థానానికి వివరించారు. కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం, విచారణ జనవరి 5కు వాయిదా వేసిన న్యాయస్థానం.