Monday, May 20, 2024
HomeTrending Newsకాంగ్రెస్.. టిఆర్ఎస్ వేర్వేరు కాదు - ఈటెల రాజేందర్

కాంగ్రెస్.. టిఆర్ఎస్ వేర్వేరు కాదు – ఈటెల రాజేందర్

తెలంగాణ ఉద్యమానికి ఎవరు దిక్కులేని నాడు ఆదుకున్న ముద్దుబిడ్డ రాజగోపాల్ రెడ్డి అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 2006 ఎన్నికల్లో ఎవరు దిక్కు లేకపోతే.. ఆనాడు ఇప్పుడు నీ పక్కకు ఉన్న ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎవరు లేరు.. అప్పుడు నీకు సపోర్ట్ చేసిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం కిష్టాపురంలో ఈ రోజు ఈటెల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షో లో మాట్లాడుతూ…టీఆర్ఎస్ పుట్టడానికంటే ముందే రాజగోపాల్ రెడ్డి ఒక కాంట్రాక్టర్ అన్నారు. 2009లో ప్రజల ఆశీర్వాదంతో పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించారన్నారు. ఆనాడు పార్లమెంటులో జై తెలంగాణ ఈనాడు అసెంబ్లీలో జై తెలంగాణ. ఆనాడు పార్లమెంటులో స్వయంగా సోనియాగాంధీ కండ్ల ముందు ప్రణబ్ ముఖర్జీ హెచ్చరించినా కూడా నాకు ఎంపీ పదవీ కంటే తెలంగాణ ముఖ్యమని చెప్పిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి అని ప్రశంసించారు.

కెసిఆర్ దావతులకు…తెరాస తినిపించే ఎంగిలి మెతుకులకు లొంగిపోయే బిడ్డలు కాదు ఈ నల్లగొండ బిడ్డలని ఈటెల రాజేందర్ అన్నారు. 2019 ఎన్నికల ముందు మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన పావలా వడ్డీ రుణాలు ఇచ్చాడు. ధనిక రాష్ట్రం అంటాడు కదా ఎందుకు రుణాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలుగా మహిళాలకు ఇవ్వాల్సిన 4,000 కోట్ల రుణాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. కెసిఆర్ మాటలు తియ్యగా మాట్లాడుతాడని, దళిత బిడ్డలకు 10 లక్షల రూపాయలు ఇచ్చి గుళ్లోకి తీసుకెళ్లి ప్రమాణాలు చేయించాడన్నారు. కానీ హుజురాబాద్ బిడ్డలు లోపట మాత్రం రాజేంద్ర అన్నకు ఓటేస్తామని ప్రమాణాలు చేసి మరి గెలిపించారన్నారు. వాళ్ల అవసరానికి టీఆర్ఎస్ దావతులు ఇస్తుంది… వాళ్ళ అవసరానికి ఓటుకు డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వేర్వేరు కాదని, టిఆర్ఎస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కుంటుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసింది కెసిఆర్ తప్ప రాజగోపాల్ రెడ్డి కాదన్నారు. కెసిఆర్ కుటుంబ పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా టిఆర్ఎస్ పార్టీ నాయకులారా పింఛనిచ్చి పెద్దకొడుకయండు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి మేనమామ అయ్యిండు…రైతుబంధు ఇచ్చి రైతుబంధు అయ్యాడు అని చెబుతున్నారు కానీ ఈ కిస్టాపురం గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు పెట్టాడో ఆలోచించండన్నారు. రాబోయే కాలంలో కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టడంలో మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం అని మాట ఇస్తున్న అని ఈటెల రాజేందర్ అన్నారు.

Also Read : మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్