Saturday, July 27, 2024
HomeTrending Newsకాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతల స్వీకరణ

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతల స్వీకరణ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు పార్టీ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ అత్యున్నత పదవికి ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఇతర పార్టీలు కాంగ్రెస్ నుండి పాఠం నేర్చుకుని రహస్య బ్యాలెట్ ద్వారా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తాయని ఆశిస్తున్నానని మిస్త్రీ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఇతర సీనియర్ నేతలు, ఎంపీలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు ఖర్గే నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన ఇంట్లో కలిశారు. ఈ ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి  నివాళులర్పించారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో పాటు మాజీ డిప్యూటీ పీఎం జగ్జీవన్ రామ్‌లకు కూడా ఆయన నివాళులు అర్పించారు. 24 సంవత్సరాలలో నెహ్రూ-గాంధీ కుటుంబేతర మొదటి కాంగ్రెస్ చీఫ్‌గా ఖర్గే ఎన్నికయ్యారు. అపారమైన సంస్థాగత, పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీకి నిరాకరించడంతో ఖర్గే పార్టీ అత్యున్నత పదవికి ఎన్నికల బరిలోకి దిగారు. 80 ఏళ్ల ఖర్గే శశి థరూర్‌పై “సోనియా విధేయ అభ్యర్థి”గా కనిపించారు. శశిథరూర్‌కు 1072 ఓట్లు రాగా.. ఖర్గే 7,897 ఓట్లు సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్