Sunday, January 19, 2025
Homeసినిమానాగార్జున, అల్లరి నరేష్ మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

నాగార్జున, అల్లరి నరేష్ మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

నాగార్జున ఇక నుంచి చేసే సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి అనుకుంటున్నారట. ఇటీవల నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’, ‘ది ఘోస్ట్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దీంతో జనాలు నాగార్జునను యాక్షన్ మూవీస్ లో చూడడానికి ఇష్టపడడం లేదని.. ఎంటర్ టైన్మెంట్ మూవీస్ చేయడానికి ఇష్టపడుతున్నారని గ్రహించి ఆ తరహా చిత్రాలు చేయాలి అనుకుంటున్నారు. ది ఘోస్ట్ మూవీ తర్వాత నాగార్జున ఎవరితో సినిమా చేయనున్నారనేది ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ తో నాగార్జున సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

సినిమా చూపిస్త మామా, నేను లోకల్, ధమాకా సినిమాతో రైటర్ గా సూపర్ సక్సెస్ అందుకున్న ప్రసన్నకుమార్ బెజవాడ. ఇప్పుడు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. కింగ్ నాగార్జున ప్రసన్న కుమార్ కి అవకాశం ఇచ్చి దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.

రీసెంట్ గా నానికి జోడీగా ఈ బ్యూటీ తన రెండో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు నాగార్జునతో మూడో సినిమాని కూడా ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే… యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో కనిపించబోతుంది అని తెలుస్తుంది. మొత్తానికి నాగార్జున చాలా ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సినిమా ప్రారంభం కాకుండానే అంచనాలు పెంచేసింది. మరి.. ఈ సినిమాతో నాగార్జున బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్