Saturday, November 23, 2024
Homeసినిమాఆయ‌నే నిజ‌మైన ‘బంగార్రాజు’ :  నాగార్జున

ఆయ‌నే నిజ‌మైన ‘బంగార్రాజు’ :  నాగార్జున

Blockbuster Meet: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కినత భారీ చిత్రం బంగార్రాజు. ఈ సినిమా జనవరి 14న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న సందర్భంగా  రాజమండ్రిలో బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్‌ను నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఇటువంటి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేస్తే చూస్తారా? అని ప్రపంచమంతా భయపడ్డారు. నార్త్ ఇండియాలో సినిమాలను ఆపేశారు. కానీ మన తెలుగు సినీ ప్రేమికులు మాత్రం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయమని, చూస్తామని, బ్లాక్ బస్టర్ ఇస్తామని అన్నారు. అనుకున్న‌ట్టుగా బంగార్రాజు చిత్రం విజ‌యం సాధించింది. ఇంత‌టి విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కులంద‌రికీ నా పాదాభివందనాలు. నా మీదున్న నమ్మకంతోనే సినిమా ఇంత హిట్ అయిందని నా యూనిట్ అంతా పొగుడుతుంటుంది. కానీ నాకు తెలుగు ప్రేక్షకుల మీదున్న నమ్మకం ఈ సినిమా.

సినిమా అంటే సంక్రాంతి.. సంక్రాంతి అంటే సినిమా అని మరోసారి రుజువు చేశారు. రాజమండ్రిలో సినిమా ఇంకా హౌస్ ఫుల్‌లో ఆడుతోందని విన్నాను. అన్ని థియేటర్లో ఇంకా హౌస్ ఫుల్ ఉందని విన్నాను. నేను కలెక్షన్ల గురించి మాట్లాడేందుకు రాలేదు. మీ ప్రేమ గురించి మాట్లాడేందుకు వచ్చాను. మీ ప్రేమ ముందు కలెక్షన్స్ నథింగ్. దీని కంటే ఇంకేం కావాలి. ఇదంతా చూసినప్పుడల్లా మేం అంతా కూడా అక్కినేని నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తోంది. మిమ్మల్ని, మీ ప్రేమ, ఇదంతా ఆయన చూపించారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్.

మొన్న నా మిత్రులు చిరంజీవి గారితో మాట్లాడాను. వైఎస్ జగన్ గారిని కలిసొచ్చారు.. ఏం మాట్లాడారు అని అడిగాను. సినిమా ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని వైఎస్ జగన్ గారు చెప్పారు అని చిరంజీవి గారు అన్నారు. వైఎస్ జగన్ గారికి కూడా థ్యాంక్స్. బంగార్రాజు అచ్చమైన తెలుగు సినిమా. మన పంచెకట్టుతో, మన సంబరాలు, మన సరసాలతో అచ్చమైన తెలుగు సినిమా. బంగార్రాజు మేం కాదు. మా నాన్న గారు. ఇక్కడే ఎక్కడో ఆయన ఉండి చూస్తుంటారు. ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు రెండు కళ్లు అని అంటారు. ఆయన్ని మనం ఎప్పుడూ తలుచుకోవాలి. ఎన్టీఆర్ లివ్స్ ఆన్. ఏఎన్నార్ లివ్స్ ఆన్ అని అన్నారు.

Also Read : మూడు రోజుల‌కు 53 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసిన ‘బంగార్రాజు’

RELATED ARTICLES

Most Popular

న్యూస్