కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఓటర్ల జాబితాని విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు సంబంధించి నూతన జాబితాలు రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరువ కాగా, ఏపీలో 4 కోట్లకు దగ్గరైంది. ప్రతి సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం సవరణల తర్వాత జనవరిలో ఓటర్ల తుది జాబితాలను ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది.
తాజాగా ప్రకటించిన జాబితాల ప్రకారం…
తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య- 2,99,92,941
పురుష ఓటర్ల సంఖ్య- 1,50,48,250
మహిళా ఓటర్ల సంఖ్య- 1,49,24,718
థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 1,951
సర్వీసు ఓటర్ల సంఖ్య- 15,282
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య- 42,15,456
రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 31,08,068
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 25,24,951
అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి (6,44,072)
అతి తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం భద్రాచలం (1,42,813)
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 3,99,84,868
ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య- 2,02,19,104
ఏపీలో పురుష ఓటర్ల సంఖ్య- 2,01,32,271
ఏపీలో సర్వీసు ఓటర్ల సంఖ్య- 68,162
థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 3,924
అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లా కర్నూలు (19,42,233)
అతి తక్కువగా ఓటర్లు కలిగి వున్న జిల్లా (7.29,085)