తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. కామన్ వెల్త్ గేమ్స్ బాక్సింగ్ 50 కిలోల విభాగంలో స్వర్ణం సాధించింది. నేడు జరిగిన ఫైనల్ పోరులో ఉత్తర ఐర్లాండ్ కు చెందిన మెక్ నాల్ పై 5-0తో ఏకపక్షంగా గెలుపొందింది.
ఈ ఏడాది మే నెలలో ఇస్తాంబుల్ లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్లో గోల్డ్ మెడల్ సాధించిన జరీన్ కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సొంతం చేసుకుంది.
అంతకు ముందు మరో ఇద్దరు భారత బాక్సర్లు స్వర్ణాలతో మేరిశారు. మహిళల 48కిలోల విభాగంలో నితు గాంఘస్ గోల్డ్ గెల్చుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్ బాక్సర్ డెమీ రెస్టాన్ పై 5-0తో విజయం సాధించింది.
పురుషుల 51 కిలోల విభాగంలో అమిత్ పంఘల్ ఇంగ్లాండ్ క్రీడాకారుడు 5-0తో ఓడించి స్వర్ణం సాధించాడు.
నేడు మొత్తం ముగ్గురు బాక్సర్లు స్వర్ణాలతో మెరిసి పతకాల పట్టికలో భారత దేశం స్థానాన్ని నాలుగుకు ఎగాబాకేలా చేశారు.