Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ .. 'డ్రాగన్ ?'

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ .. ‘డ్రాగన్ ?’

ఎన్టీఆర్ త్వరలో ‘దేవర’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై, భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ – కొరటాల నుంచి గతంలో ‘జనతా గ్యారేజ్’ అనే హిట్ రావడం వలన, సహజంగానే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా ఈ సినిమాతోనే పరిచయమవుతుండటం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని కొంత కాలంగా అభిమానులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదింపుతూ నిన్న ఈ ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొట్టారు. రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది. హోంబలే బ్యానర్ పైనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు అదే టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు.

ఇక ఈ సినిమాను 2026 జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించడం విశేషం. పట్టాలపైకి వెళ్లిన రోజునే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం అభిమానులకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తోంది. ప్రశాంత్ నీల్ ఎంచుకునే కథలు ఎలా ఉంటాయనే విషయంలో ప్రేక్షకులకు ఒక అవగాహన ఉంది. అందువలన అదే జోనర్లో ఈ సినిమా కూడా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇతర పాత్రలలో ఎవరెవరిని తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్