Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Planting Program Delhi : కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం తీసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కరోల్ భాగ్ జోన్ నరైనా ఇండస్ట్రియల్ ఏరియా పార్క్ లో (Naraina Industrial Area) రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మొక్కలు నాటారు. పార్క్ ఖాళీ స్థలంలో మియావాకీ పద్దతిలో వెయ్యి మొక్కలు నాటి మినీ ఫారెస్ట్ ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అభివృద్ధి చేస్తోంది.

నాలుగేళ్ల క్రితం తాము ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి ఫలితాలు సాధిస్తూ, పచ్చదనం పెంపు దిశగా అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నామని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నలుదిశలా హరిత స్ఫూర్తి విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని దశలవారీగా పూర్తిచేస్తామని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. యువ ఎంపీ సంతోష్ ఆదర్శవంతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాడని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా హరిత భారత కార్యక్రమాన్ని తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ జైరామ్ రమేష్ ఆకాంక్షించారు. ఢిల్లీ లాంటి ప్రాంతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అత్యంత అవసరమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. పర్యావరణ పరంగా ఎదురవుతున్న సవాళ్లను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపు తక్షణావసరం అని ఆ దిశగా కృషి చేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి అభినందనలు అని శివ సేన ఎంపీ అనిల్ దేశాయ్ అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో తనవంతుగా భాగస్వామ్యం తీసుకునేందుకు రాంకీ సంస్థ ముందుకు వచ్చింది. ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా తమ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఒక పార్కు ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న రామ్ కీ సంస్ధ చైర్మన్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు.

Planting Program Delhi

ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో పాటు, ఎంపీలు జయరామ్ రమేష్, సంజయ్ సింగ్ (ఆప్), బినోయ్ విశ్వం.(సీపీఐ) అనిల్ దేశాయ్ (శివ సేన), ఏపీ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయ సాయి రెడ్డి తో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వంగా గీత, మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, తెలంగాణ ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, జి.రంజిత్ రెడ్డి, మన్నే. శ్రీనివాసరెడ్డి, మాలోత్ కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, కెఆర్ సురేష్ రెడ్డి, పసునూరు దయాకర్, పీ. రాములు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థల డైరెక్టర్ ఎన్. బలరామ్ కూడా పాల్గొని మొక్కలు నాటారు.

Also Read :  ఆమె ఒక తులసి వనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com