Thursday, April 3, 2025
Homeస్పోర్ట్స్థాయ్ లాండ్ ఓపెన్: క్వార్టర్స్ కు సింధు

థాయ్ లాండ్ ఓపెన్: క్వార్టర్స్ కు సింధు

Sindhu Only: థాయ్ లాండ్ ఓపెన్ -2022లో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో కొరియా క్రీడాకారిణి  సిమ్ యూ జిన్ పై 21-16;21-13 తేడాతో విజయం సాధించింది.

అయితే సింధు మినగా మిగిలిన క్రీడాకారులు రెండో రౌండ్ లోనే వెనుదిరిగారు. కిడాంబి శ్రీకాంత్ వాకోవర్ గా వెనుదిరిగాడు. ఐరిష్ క్రీడాకారుడితోనేడు శ్రీకాంత్ తలపడాల్సి ఉంది.  మ్యాచ్ కు కొద్ది సమయం ముందు శ్రీకాంత్ తన నిర్ణయం ప్రకటించాడు, అయితే దీనికి గల కారణమేమిటనేది తెలియాల్సి ఉంది.  మరో మహిళల సింగిల్స్ మ్యాచ్ లో మాళవిక బన్సోద్ 21-16; 14-21;14-21 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ లైన్ క్రిస్టోఫియర్సన్ చేతిలో ఓటమి పాలైంది.

ఇక డబుల్స్ విషయానికి వస్తే  మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్- తానీషా క్రిస్టో……మహిళల డబుల్స్ లో అశ్విని భట్-శిఖా గౌతమ్ జోడీలు ఓటమి పాలయ్యారు.

దీనితో ఇక ఇండియా ఆశలన్నీ సింధు పైనే….

Also Read థాయ్ ఓపెన్: సింధు, శ్రీకాంత్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్