only for Power: కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిసారీ బిజెపి నేతలు కేంద్ర నిధులు అంటూ మాట్లాడడంపై అయన అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళిన నిధులనే రాష్ట్రాలకు ఇస్తోందని, అవి కూడా రాష్ట్రాలకు హక్కుగా రావాల్సినవే ఇస్తున్నారని, చారిటీ కాదని వ్యాఖ్యానించారు. మేమే ఇస్తున్నామంటూ మాట్లాడడం సరికాదని, కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా ఇవ్వాల్సిందేనని సజ్జల అన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పొత్తుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నాయని, ప్రజల అభిప్రాయాన్ని అసలు పరిగణన లోకి తీసుకోకుండా ఎవరికెన్ని సీటు వస్తాయో చూసుకుంటున్నారని సజ్జల మండిపడ్డారు. కేవలం అధికారం కోసమే పొత్తులు కుదుర్చుకుంటున్నారని, వారు సింగల్ గా వచ్చినా, పొత్తులతో వచ్చినా తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ బిజెపి-టిడిపి మధ్య మధ్యవర్తిగా పనిచేస్తున్నట్లు అనుమానం కలుగుతోందని సజ్జల అన్నారు. సొంతంగా అధికారంలోకి రావాలనే తపన పవన్ కు ఉంటే మిగిలిన రెండు ఆప్షన్స్ ఎందుకని అయన ప్రశ్నించారు. 2019లో జగన్ మోహన్ రెడ్డికి వచ్చే ఓటును చీల్చడం కోసమే పవన్ కళ్యాన్ బైటికి వచ్చినట్లు నటించి సొంతంగా పోటీ చేశారని విమర్శించారు. కేవలం చంద్రబాబును అధికారంలోకి తీసుకు రావడం కోసమే పవన్ బ్రోకరిజం చేస్తున్నట్లు ఉందని ఘాటుగా విమర్శించారు.
Also Read : మీ వైఖరేంటో చెప్పండి: సజ్జల డిమాండ్