Sunday, May 19, 2024
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: పాకిస్తాన్ కు తొలి విజయం

మహిళల వరల్డ్ కప్: పాకిస్తాన్ కు తొలి విజయం

Pak won: ఐసిసి మహిళా వరల్డ్ కప్ -2022లో పాకిస్తాన్ బోణీ చేసింది. వెస్టిండీస్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నమెంట్ లో మొదటి విజయంతో పాటు మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో 2009 తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకు విజయం అందుకుంది. హామిల్టన్ లోని సెడ్డాన్ లో జరిగిన ఈ మ్యాచ్ ను వర్షం కారణంగా మ్యాచ్ ను 20 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

విండీస్ 19 పరుగుల వద్ద తొలి వికెట్ (హీలీ మాథ్యూస్-1); 34 వద్ద రెండో వికెట్ (దాట్టిన్-27) కోల్పోయింది. కెప్టెన్ టేలర్-18; చివర్లో ఫ్లెచర్-12 మాత్రమే రాణించారు. 20ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది.  పాక్ బౌలర్లు చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో బౌల్ చేయడంతో విండీస్ మహిళలు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా నిదా దార్ నాలుగు ఓవర్లలో 10 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ఫాతిమా సనా, నష్రా సంధు, ఒమైనా సోహైల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

పాకిస్తాన్ 22 వద్ద తొలి వికెట్ (సిద్రా అమీన్ -8); 57వద్ద రెండో వికెట్ (మునీబా అలీ-37) కోల్పోయింది. ఆ తర్వాత బిస్మా మరూఫ్-20; ఒమైనా సోహైల్-22 పరుగులతో అజేయంగా నిలిచి 18.5 ఓవర్లలో లక్ష్యం సాధించారు.  విండీస్ బౌలర్లలో ఫ్లెచర్, షకీరా సెల్మాన్ చెరో వికెట్ పడగొట్టారు.

నిదా దార్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్