Sunday, January 19, 2025
HomeTrending Newsపారామెడికల్ ఆప్తాల్మిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

పారామెడికల్ ఆప్తాల్మిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

కంటి వెలుగు కార్యక్రమం అమలులో భాగంగా పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్యారోగ్య శాఖ ఈ రోజు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా నియామక బాధ్యత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ఇంటర్ వ్యూ పద్దతిలో నియామకాలు జరుగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిసెంబర్ 1 వ తేదీన నోటిఫికేషన్, 5 వ తేదీన ఇంటర్ వ్యూ, 10 వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. కంటి వెలుగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1491 వైద్య బృందాలను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం… జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు -2 ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

Also Read : జనవరి 18 నుంచి కంటివెలుగు-2 

RELATED ARTICLES

Most Popular

న్యూస్