Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌ డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన చైతన్య

మహేష్‌ డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన చైతన్య

మహేష్‌ బాబు, పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేష్‌ బాబు సరసన కీర్తి సురేష్ నటించింది. గత సంవత్సరం సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట కమర్షియల్ సక్సెస్ సాధించింది. అయితే.. ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధించలేదు. ఈ సినిమా తర్వాత పరశురామ్.. నాగచైతన్యతో సినిమా చేయాలి అనుకున్నారు. అసలు సర్కారు వారి పాట కంటే ముందే నాగచైతన్యతో సినిమా చేయాలి. అయితే.. మహేష్‌ బాబుతో సినిమా చేసే ఛాన్స్ రావడంతో నాగచైతన్యతో అనుకున్న ప్రాజెక్ట్ పక్కనపెట్టి సర్కారు వారి పాట చేశాడు.

నెక్ట్స్ చైతన్యతో పరశురామ్ సినిమా ఉంటుంది అని వార్తలు వచ్చాయి. అయితే.. నాగచైతన్య వెంకట్ ప్రభుతో ‘కస్టడీ’ సినిమాను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం కస్టడీ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మే లో కస్టడీ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత పరశురామ్ తో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది కానీ.. ఆ అందులో నిజం లేదని తెలిసింది. పరశురామ్ చెప్పిన స్టోరీలో చైతన్య కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడట. ఆయన చెప్పినట్టుగా పరశురామ్ మార్పులు చేసినప్పటికీ చైతన్య సంతృప్తి చెందలేదని.. అందుచేత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని సమాచారం.

సర్కారు వారి పాట తర్వాత నాగచైతన్య రెడీగా ఉంటాడు. ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నాడు పరశురామ్. వీరిద్దరి కాంబోలో మూవీకి నాగేశ్వరరావు అనే టైటిల్ అనుకున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకుంది. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అందుచేత ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసి పరశురామ్ కి చైతన్య షాక్ ఇచ్చాడని చెప్పచ్చు. నెక్ట్స్ ఏంటి అనేది నాగచైతన్య ప్రకటించలేదు. అలాగే పరశురామ్ అనౌన్స్ చేయలేదు. మరి.. వీరిద్దరూ నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్