గ్రేటర్ హైదరాబాద్ లో ఈ నెల 3 నుంచి 15 రోజులు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో పట్టణ ప్రగతి పై సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా నాలా, గార్బేజి, హరితహారం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎస్‌ఎన్‌డీపీతో నగరంలో నాలాల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. పట్టణ ప్రగతిలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి సహకారం అందించాలని కోరారు. గత ప్రభుత్వాలు నాలాలను పట్టించుకోలేదని… కానీ తాము దూరదృష్టితో పనులు చేపడుతున్నామన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ముంపు ప్రభావం తగ్గుతుందని తెలిపారు. వచ్చే నాటికి ముంపు ప్రభావం లేకుండా చూస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
ఈ సమావేశంలో మేయర్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మొహినోద్దిన్, మౌజం ఖాన్, TSEWIDC చైర్మన్ శ్రీధర్ రెడ్డి, బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ నగేష్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, అదనపు కమిషనర్ సంతోష్, జోనల్ కమిషనర్ లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Also Read : దళితబంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు