Sunday, January 19, 2025
HomeTrending NewsNDA meeting: ఢిల్లీకి జన సేనాని

NDA meeting: ఢిల్లీకి జన సేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ వెన్ననున్నారు. మంగళవారం జరగనున్న ఎన్డీయ మిత్రపక్షాల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ విషయాన్ని  జనసేన అధికార ప్రతినిధి  ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

“ఈ నెల 18న ఢిల్లీలో జరగనున్న ఎన్జీవి సమావేశంలో పాల్గొనవలసినదిగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందింది. ఎన్టీఏలో భాగస్వాములైన రాజకీయ పక్షాల అగ్రనేతలు. హాజరవుతున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ నెల 17 సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. బీజేపీ అగ్రనాయకత్వం. నుంచి కొద్ది రోజుల క్రిందటి పార్టీకి ఈ ఆహ్వానం అందింది” అంటూ ప్రకటనలో పెర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతుందని జాతీయ మీడియా ప్రచారం చేసినా ఇంతవరకూ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. జన సేన కు మాత్రమే ఈ భేటీకి హాజరు కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్