Sunday, September 29, 2024
Homeసినిమామరో మూవీ ప్రారంభిస్తున్న పవర్ స్టార్..?

మరో మూవీ ప్రారంభిస్తున్న పవర్ స్టార్..?

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు ఏ సినిమా షూటింగ్ కి డేట్స్ ఇస్తాడో.. ఎవరికీ తెలియదు. ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేశాడు. ఈ సినిమా కంటే వెనకాల స్టార్ట్ చేసిన భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యింది కానీ.. వీరమల్లు మాత్రం ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. సమ్మర్ కి వీరమల్లు చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటున్నారు కానీ.. వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. వీరమల్లు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే… రెండు నెలల కిందట హరీష్ శంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా ఓపెనింగ్‌ చేశారు. అదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. తరువాత మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఈలోపు వినోదియ సిత్తం రీమేక్ సెట్స్ మీదికి వెళ్లనున్నట్లుగా వార్తలొచ్చాయి. దాని కోసం అభిమానులు ఎదురు చూస్తుండగానే.. ఇంకో సినిమా ఓపెనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. హరీష్ సినిమా ఓపెనింగ్ కంటే ముందు అనౌన్స్‌మెంట్‌తో ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన సుజీత్ సినిమాకు ప్రారంభోత్సవం చేయించబోతున్నారట. అందుకు డేట్ కూడా ఫిక్సయినట్లు సమాచారం.

ఈ నెల 30న సుజీత్ సినిమా ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.సుజీత్ తెరకెక్కించబోయే సినిమా ఇదే. పవర్ స్టార్‌కు వీరాభిమాని అయిన సుజీత్ తీయబోయే ఈ సినిమా విషయంలో అభిమానులు కూడా చాలా ఎగ్జైటెట్‌గా ఉన్నారు. ఇదోక గ్యాంగ్‌స్టర్ మూవీ అని.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని ఆ పోస్టర్లో చెప్పకనే చెప్పేశాడు సుజీత్. వీరమల్లు కంప్లీట్ చేయలేదు.. ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ చేయలేదు.. వినోదయ సీతం ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అప్ డేట్ లేదు. ఇప్పుడు సుజిత్ తో మూవీని ప్రారంభించాలి అనుకోవడంతో ఆసక్తిగా మారింది. మరి.. ఈ సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్